Medigadda :అక్టోబర్ 17న కోర్టుకు రండి

మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ కుంగడం, ప్రజాధానానికి భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి సహా 8 మందికి కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు హాజరై మెమో ఆఫ్​ అప్పీయరెన్స్ దాఖలు చేయగా మాజీ సీఎం కేసీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తరఫున ఎవరూ హాజరు కాలేదు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న హరీశ్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్, ఇరిగేషన్ చీఫ్​ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరఫున న్యాయవాదులు హాజరై మొమోలు దాఖలు చేశారు. దీంతో కేసు విచారణను వచ్చే నెల 17కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది(Medigadda). మెమో దాఖలు చేయని మాజీ సీఎం కేసీఆర్, స్మితా సబర్వాల్ కు కొత్తగా సమన్లు జారీ చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

ALSO READ :