Dhoolpet : హల్దీ మే గల్తీ

ఎక్సైజ్​ దాడులతో అక్రమార్కులు నయా రూట్ ను​ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పసుపు ప్యాకెట్లలో గంజాయిని సప్లై చేస్తున్నారు. నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్​పోలీసులు ఇవాళ గంజాయి సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్​ చేశారు. సిటీలోని దూల్​పేట్(Dhoolpet )​కు చెందిన నేహా బాయ్​ అనే మహిళను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ​డీఎస్పీ తిరుపతి యాదవ్​, ఎస్​ఐ నాగరాజుతో పాటు సిబ్బంది రైయిడ్​ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పసుపు ప్యాకెట్లతో 10 గంజాయి ప్యాకెట్లను సీజ్​ చేశారు.

Hyderabad: పసుపు ప్యాకెట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు.. పట్టుబడిన మహిళ | Hyderabad: Excise Officials Bust Marijuana Sales in Haldi Packets

ఈ ఘటనను వెలుగులోకి తెచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్​ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్​ కమలాసన్​ రెడ్డి అభినందించారు. అధికారులు ఇదే పనితీరును కనబరచి, డగ్స్​, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు.

 

Also read :

Ayesha Khan : ఆయేషా ఖాన్ స్టన్నింగ్ లుక్స్

Handloom workers: నేతన్న శుభవార్త