CM: చెరువులను చెరబడితే చెరసాలే

చెరువులను చెరబట్టి ఫాంహౌస్ లను నిర్మించుకున్న వారికి చెరసాలే గతి అని  (CM)సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేసుకోవాలని సూచించారు. లేదంటే వారికి చెరసాలే గతి అని హెచ్చరించారు. నగర ప్రజలు తాగే నీటిలో డ్రైనేజీ వదిలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ లో(CM) సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాగు నీటి అవసరాల కోసం ఆ నాడు నిజాంనవాబు కట్టించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఆగర్భ శ్రీమంతులు విల్లాలు, ఫాంహౌస్ లు కట్టుకున్నారని, వాటికి డ్రైనేజీలు లేవని, ఆ డ్రైనేజీని తాగే నీళ్లలో వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నీళ్లను ప్రజలకు అందిస్తే తాను సీఎంగా ఫెయిలైనట్టేనని సీఎం అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టుకున్న వాళ్లు స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. లేని పక్షంలో తాము కూల్చివేస్తామని, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే వెకెట్ చేయిస్తామని చెప్పారు. చెరువులను చెరబట్టిన వాళ్లను చెరసాలకు పంపడ మే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఆక్రమణల వల్ల వరదలు వచ్చినప్పుడు పేదలు నివసించే ఇండ్లలోకి, బస్తీల్లోకి మురికి నీరు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు వాగైనా.. వరంగల్ అయినా.. కృష్ణా తీరమైనా ఆక్రమణల వల్లే నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు.Image

చెరువులను చెరబట్టి ఫాంహౌస్ లను నిర్మించుకున్న వారికి చెరసాలే గతి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేసుకోవాలని సూచించారు. లేదంటే వారికి చెరసాలే గతి అని హెచ్చరించారు. నగర ప్రజలు తాగే నీటిలో డ్రైనేజీ వదిలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాగు నీటి అవసరాల కోసం ఆ నాడు నిజాంనవాబు కట్టించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఆగర్భ శ్రీమంతులు విల్లాలు, ఫాంహౌస్ లు కట్టుకున్నారని, వాటికి డ్రైనేజీలు లేవని, ఆ డ్రైనేజీని తాగే నీళ్లలో వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నీళ్లను ప్రజలకు అందిస్తే తాను సీఎంగా ఫెయిలైనట్టేనని సీఎం అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టుకున్న వాళ్లు స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. లేని పక్షంలో తాము కూల్చివేస్తామని, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే వెకెట్ చేయిస్తామని చెప్పారు. చెరువులను చెరబట్టిన వాళ్లను చెరసాలకు పంపడ మే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఆక్రమణల వల్ల వరదలు వచ్చినప్పుడు పేదలు నివసించే ఇండ్లలోకి, బస్తీల్లోకి మురికి నీరు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు వాగైనా.. వరంగల్ అయినా.. కృష్ణా తీరమైనా ఆక్రమణల వల్లే నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు.

Also read: