నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్ ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ రిలీజ్ చేసింది. అందుకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 20న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. విద్యార్థులు ఆప్షన్స్ ఎంచుకునేందుకు గడవు సెప్టెంబర్ 23 నుండి 26 వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ సెప్టెంబర్ 26 సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11.55 వరకు కొనసాగనుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 27 నుండి 29 మధ్య జరగనుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ మెంట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ లిస్ట్ లో పేరు వచ్చిన విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 8 మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 21న ముగియనున్నట్టు సమాచారం. కౌన్సెలింగ్ ప్రక్రియ ఫలితాలు అక్టోబర్ 24 రిలీజ్ కానున్నాయి. సెలక్ట్ అయిన వారు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 మధ్య తమకు నిర్దేశించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. నవంబర్ 7 నుంచి 12 మధ్య మూడో రౌండ్ రిజిస్ట్రేషన్లు నిర్వహించి నవంబర్ 16న ఫలితాలు విడుదల చేయనున్నారు. స్ట్రే వాక్ రౌండ్ కు సంబంధించి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 మధ్య రిజిస్ట్రేషన్లు జరగగా, ఫలితాలు డిసెంబర్ 5న ప్రకటించబడతాయి.

Also read: