Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసీఎమ్ లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తుండగా.. చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకోవడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. కేబిన్‌లో ఉన్న వారు అందరూ సురక్షితంగా ఉన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను  (Andhra Pradesh) దేవరపల్లి పోలీసులు వెలికి తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందినవారు. మృతుల వివరాలు.. తమ్మి రెడ్డి సత్యనారాయణ (45), దేశాభత్తుల వెంకటరావు(40), బొక్కా ప్రసాద్(32), పెనుగుర్తి చిన్న ముసలయ్య(35), కత్తివ కృష్ణ(40), కత్తివ సత్తిపండు (40), తాడి కృష్ణ(45). పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసీఎమ్ లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తుండగా.. చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకోవడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. కేబిన్‌లో ఉన్న వారు అందరూ సురక్షితంగా ఉన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను దేవరపల్లి పోలీసులు వెలికి తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందినవారు. మృతుల వివరాలు.. తమ్మి రెడ్డి సత్యనారాయణ (45), దేశాభత్తుల వెంకటరావు(40), బొక్కా ప్రసాద్(32), పెనుగుర్తి చిన్న ముసలయ్య(35), కత్తివ కృష్ణ(40), కత్తివ సత్తిపండు (40), తాడి కృష్ణ(45). పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: