Mahesh Kumar Goud: పరిమితంగానే పీసీసీ కార్యవర్గం

Mahesh Kumar Goud

ఈ నెల 15వ తేదీన తాను పీసీసీ చీఫ్​ గా బాధ్యతలు స్వీకరిస్తానని నూతన అధ్యక్షుడు  (Mahesh Kumar Goud)మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి పీసీసీ కార్యవర్గం పరిమితంగా ఉంటుందని అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నందున పీసీసీలో పదవులు పెంచామని వివరించారు. పార్టీ విస్తరణ, పోరాటాల కోసం చాలా మందికి పదవులు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పడు అధికారంలో ఉన్నందున పీసీసీ కార్యవర్గాన్ని బాగా కుదిస్తామని చెప్పారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నానని, ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతానని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పోతానని అన్నారు. పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు తప్పక ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అందుకే తనను పీసీసీ చీఫ్ గా నియమించిందని వివరించారు. గత ఏడాది సెప్టెంబర్ 17న గాంధీభవన్ లో కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడూ అదే విధంగా చేస్తామని చెప్పారు.

Also read: