కొంత కాలంగా (Horror)హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన స్త్రీ, స్త్రీ–2 గ్రాండ్ సక్సెస్ కావడమే ఇందుకు నిదర్శనం. స్టార్స్ తో సంబంధం లేకుండా ఈ జోనర్ మూవీస్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కొద్దిగా నవ్వించి, కాస్తా భయపెడితే చాలు కాసుల వర్షం కురుస్తోంది. ఇలాంటి మూవీస్ లో నటించేందుకు ఒకప్పుడు వెనుకడుగు వేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సై అంటున్నారు ఇప్పటికే రాశిఖన్నా, తమన్నా, హన్సిక, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ ఈ జోనర్ లో నటించి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. వీళ్లనే ఫాలో కాబోతోంది బుట్టబొమ్మ. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే హరర్ మూవీలో దెయ్యంగా భయపెట్టబోతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డేకి రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ లో ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ముని, కాంచన, గంగ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే ప్రాంచైజీ లో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పూజాహెగ్డే పేరును అధికారికంగా ప్రకటన చేయబోతున్నారని సమాచారం.
కొంత కాలంగా హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన స్త్రీ, స్త్రీ–2 గ్రాండ్ సక్సెస్ కావడమే ఇందుకు నిదర్శనం. స్టార్స్ తో సంబంధం లేకుండా ఈ జోనర్ మూవీస్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కొద్దిగా నవ్వించి, కాస్తా భయపెడితే చాలు కాసుల వర్షం కురుస్తోంది. ఇలాంటి మూవీస్ లో నటించేందుకు ఒకప్పుడు వెనుకడుగు వేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సై అంటున్నారు. ఇప్పటికే రాశిఖన్నా, తమన్నా, హన్సిక, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ ఈ జోనర్ లో నటించి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. వీళ్లనే ఫాలో కాబోతోంది బుట్టబొమ్మ. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే హరర్ మూవీలో దెయ్యంగా భయపెట్టబోతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డేకి రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ లో ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ముని, కాంచన, గంగ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే ప్రాంచైజీ లో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పూజాహెగ్డే పేరును అధికారికంగా ప్రకటన చేయబోతున్నారని సమాచారం.
Also read:
