Harish: డైవర్ట్ పాలిటిక్స్ లో రేవంత్ దిట్ట

harish

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై గాంధీ అనుచరులు చేసిన దాడి ముమ్మాటికి రేవంత్ చేసిన దాడేనని మాజీ మంత్రి హరీశ్ (Harish) రావు ఆరోపించారు. కోకాపేటలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో సీఎం రేవంత్ దిట్ట. చేసిందంతా చేసి ఇప్పుడు రివ్యూ చేయమని చెప్తున్నారు. శాంతి భద్రతలు వైఫల్యం అయ్యాక రివ్యూ నా? ప్రజలే రేవంత్ కు బుద్ధి చెప్తారు. నిన్నటి దాడిలో పోలీసుల తప్పేం లేదు. వారు అద్భుతంగా పని చేశారని హరీశ్ (Harish) రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన్ని ఎందుకు ఆపలేదు? నిన్న కంట్రోల్ చేసి ఉంటే.. ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన భాష బజారు భాషలా ఉంది. కోమటిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మీరు, మీ మంత్రులు కంట్రోల్ లో ఉండండి. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనలా ఉంది. రేవంత్ మాటలను డీజీపీ గుడ్డిగా నమ్మొద్దు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కుట్ర చేస్తున్నారు. ఆంధ్ర ప్రజల పట్ల రేవంత్ కపట ప్రేమ చూపిస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ ఎన్నిక కాదు సెలక్షన్ జరిగింది. ఏ రోటికి ఆరోటి పాట పాడటం రేవంత్ అలావాటైంది. కౌశిక్ రెడ్డి సెటిలర్లను ఉద్దేశించి ఏం అనలేదు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై గాంధీ అనుచరులు చేసిన దాడి ముమ్మాటికి రేవంత్ చేసిన దాడేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కోకాపేటలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో సీఎం రేవంత్ దిట్ట. చేసిందంతా చేసి ఇప్పుడు రివ్యూ చేయమని చెప్తున్నారు. శాంతి భద్రతలు వైఫల్యం అయ్యాక రివ్యూ నా? ప్రజలే రేవంత్ కు బుద్ధి చెప్తారు. నిన్నటి దాడిలో పోలీసుల తప్పేం లేదు. వారు అద్భుతంగా పని చేశారని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన్ని ఎందుకు ఆపలేదు? నిన్న కంట్రోల్ చేసి ఉంటే.. ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన భాష బజారు భాషలా ఉంది. కోమటిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మీరు, మీ మంత్రులు కంట్రోల్ లో ఉండండి. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనలా ఉంది. రేవంత్ మాటలను డీజీపీ గుడ్డిగా నమ్మొద్దు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కుట్ర చేస్తున్నారు. ఆంధ్ర ప్రజల పట్ల రేవంత్ కపట ప్రేమ చూపిస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ ఎన్నిక కాదు సెలక్షన్ జరిగింది. ఏ రోటికి ఆరోటి పాట పాడటం రేవంత్ అలావాటైంది. కౌశిక్ రెడ్డి సెటిలర్లను ఉద్దేశించి ఏం అనలేదు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also read: