వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ (Rakul) రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత పదేండ్ల పాటు బాలీవుడ్ లో నటించిందీ భామ. అక్కడ నిర్మాత జాకీ భగ్నానీతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తర్వాత వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. జాకీ భగ్నానీని కలిశాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయంటోంది రకుల్ (Rakul). ముఖ్యంగా బంధం విలువ తెలిసొచ్చిందని చెబుతోంది. తాజాగా ఇంటర్వ్యూలో గతాన్ని గుర్తు చేసకుంది. ‘జాకీ నా జీవితంలోకి రాకముందు నాకు సంబంధాల విలువ తెలియదు. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నప్పుడు చిన్న కారణంగా అతడిని రిజెక్ట్ చేశా. మేమిద్దరం హోటల్‌కు వెళ్తే అతడు నాకోసం వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేశాడు. అది నాకు నచ్చలేదు. అందుకే బ్రేకప్ చెప్పేశా. నాకంటూ కొన్ని సొంత ఆహారపు అలవాట్లు ఉంటాయి. అతడు నేను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి చూశాడు. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించింది.’ అని చెప్పింది. ఇక తన భర్త జాకీ గురించి మాట్లాడుతూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని తెలిపారు.
తాజాగా ఇంటర్వ్యూలో గతాన్ని గుర్తు చేసకుంది. ‘జాకీ నా జీవితంలోకి రాకముందు నాకు సంబంధాల విలువ తెలియదు. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నప్పుడు చిన్న కారణంగా అతడిని రిజెక్ట్ చేశా. మేమిద్దరం హోటల్‌కు వెళ్తే అతడు నాకోసం వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేశాడు. అది నాకు నచ్చలేదు. అందుకే బ్రేకప్ చెప్పేశా. నాకంటూ కొన్ని సొంత ఆహారపు అలవాట్లు ఉంటాయి. అతడు నేను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి చూశాడు. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించింది.’ అని చెప్పింది. ఇక తన భర్త జాకీ గురించి మాట్లాడుతూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని తెలిపారు.
Also read:

