కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో విడుదలకు సిద్ధమైన సినిమా దేవర (Devara) కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వస్తున్న పెద్ద చిత్రాల్లో దేవర (Devara) ఒకటి కావడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్ మరియు జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ సినిమాపై అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఆకాశాన్ని తాకే హైప్ ఉంది. ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో దేవర(Devara) ఒకటి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నైజాం ప్రాంతంలో దాదాపు 42 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దేవర (Devara) మేకర్స్ రాష్ట్రంలో టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రత్యేక అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దేవర (Devara) నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణలు మిడ్ నైట్ షోల టికెట్ ధరను 1,000 రూపాయల వరకు, ఉదయం 4 గంటల టికెట్ రేటును 500 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. మొదటి వారం మొత్తం సినిమా టికెట్ ధరలు కూడా దాదాపు 295 రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.
Also read :
Jammu & Kashmir : ఉగ్రవాదాన్ని రూపుమాపుతం
Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత
