CM Revanth: గడీల్లో గడ్డి మొలిచేలా చేశా..

మీ గడీల్లో గడ్డి మెలిచేలా చేశా.. మీ ఫాంహౌస్ లలో జిల్లెళ్లు మొలిచేలా చేస్తానని (CM Revanth) సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను హెచ్చరించారు. త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేనని అన్నారు. దానిని భావితరాలతోపాటు.. ఇవాళ చిల్లర మల్లర మాటలు మాట్లాడే వారికి చెప్తున్నానని అన్నారు. ఇప్పటికీ దళితులు, ఆదివాసీల ఇండ్లలో ఇందిరమ్మ ఫొటో ఉంటుందని అన్నారు. ఇవాళ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం (CM Revanth) సీఎం మాట్లాడారు. వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్లు ఇవాళ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ నెహ్రూ వజ్రాల వ్యాపారం చేసి సంపాదించనదంతా దేశం కోసం ఇచ్చేసిన మహనీయుడని గుర్తు చేశారు. Imageఆయన కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య పో రాటంలో పదేండ్లు జైలు శిక్ష అనుభవించి ప్రధాని అయ్యారన్నారు. ఆయన చనిపోయిన వెంటనే ఇందిరమ్మ ప్రధాన మంత్రి కాలేదని, ఎందరో ఇతరులు ప్రధానులుగా పనిచేశారని గుర్తు చేశారు. దేశం కోసం సుపరిపాలన కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ టెక్నాలజీని దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. దేశంకోసం సర్వం త్యాగం చేసింది గాంధీ కుటుంబమని అన్నారు.Image

మీ గడీల్లో గడ్డి మెలిచేలా చేశా.. మీ ఫాంహౌస్ లలో జిల్లెళ్లు మొలిచేలా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను హెచ్చరించారు. త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేనని అన్నారు. దానిని భావితరాలతోపాటు.. ఇవాళ చిల్లర మల్లర మాటలు మాట్లాడే వారికి చెప్తున్నానని అన్నారు. ఇప్పటికీ దళితులు, ఆదివాసీల ఇండ్లలో ఇందిరమ్మ ఫొటో ఉంటుందని అన్నారు. ఇవాళ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్లు ఇవాళ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ నెహ్రూ వజ్రాల వ్యాపారం చేసి సంపాదించనదంతా దేశం కోసం ఇచ్చేసిన మహనీయుడని గుర్తు చేశారు. ఆయన కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య పో రాటంలో పదేండ్లు జైలు శిక్ష అనుభవించి ప్రధాని అయ్యారన్నారు. ఆయన చనిపోయిన వెంటనే ఇందిరమ్మ ప్రధాన మంత్రి కాలేదని, ఎందరో ఇతరులు ప్రధానులుగా పనిచేశారని గుర్తు చేశారు. దేశం కోసం సుపరిపాలన కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ టెక్నాలజీని దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. దేశంకోసం సర్వం త్యాగం చేసింది గాంధీ కుటుంబమని అన్నారు.

ALSO READ: