దేశంలో(Jamili) జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.
సెప్టెంబర్ 2, 2023 నుంచి దాదాపు 191 రోజులపాటు రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పలువురిని సంప్రదించి, వారి నుంచి వివరాలు సేకరించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని 18,626 పేజీలతో తుది నివేదికను తయారుచేసింది. తుది నివేదికను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వారికి కమిటీ అందించింది. కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పాలన పరంగా చేయాల్సిన మార్పులను కమిటీ సిఫార్సు చేసింది. పలు రాజకీయ పార్టీలు, సీనియర్ నేతలు, విశ్లేషకుల సూచనల ఆధారంగా (Jamili) జమిలీ ఎన్నికల ప్రక్రియ, మొత్తం పాలనలో ప్రాథమికంగా మార్పును తీసుకువస్తాయని కమిటీ అభిప్రాయపడింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీలు, మున్సిపాలటీలకు కూడా ఒకే సమయంలో ఎన్నికలకు నిర్వహించేందుకుగాను ఆర్టికల్ 324A ఆర్టికల్ ను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. లేకపోతే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను నిర్వహించవచ్చని పేర్కొంది.
కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పాలన పరంగా చేయాల్సిన మార్పులను కమిటీ సిఫార్సు చేసింది. పలు రాజకీయ పార్టీలు, సీనియర్ నేతలు, విశ్లేషకుల సూచనల ఆధారంగా (Jamili) జమిలీ ఎన్నికల ప్రక్రియ, మొత్తం పాలనలో ప్రాథమికంగా మార్పును తీసుకువస్తాయని కమిటీ అభిప్రాయపడింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీలు, మున్సిపాలటీలకు కూడా ఒకే సమయంలో ఎన్నికలకు నిర్వహించేందుకుగాను ఆర్టికల్ 324A ఆర్టికల్ ను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. లేకపోతే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను నిర్వహించవచ్చని పేర్కొంది.
Also read:

