AICP: రాహుల్ హత్యకు కుట్ర

ఏఐసీపీ (AICP)ప్రధాన కార్యదర్శి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాహుల్ భద్రతకు ముప్పు ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు. కంప్లయింట్ కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్టు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్‌ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని, ‘రాహుల్! బుద్ధి మార్చుకో. లేదంటే మీ నానమ్మకు పట్టిన గతే నీక్కూడా పడుతుంది’ అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు వర్గానికి చెందిన శివసేన పార్టీ ఎమ్మెల్యే, సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి రూ.11 లక్షలు బహుమానం ఇస్తానని బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

All India Congress Committee 'Research Department' - AICCRD

ఏఐసీపీ (AICP) ప్రధాన కార్యదర్శి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాహుల్ భద్రతకు ముప్పు ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు. కంప్లయింట్ కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్టు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్‌ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని, ‘రాహుల్! బుద్ధి మార్చుకో. లేదంటే మీ నానమ్మకు పట్టిన గతే నీక్కూడా పడుతుంది’ అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు వర్గానికి చెందిన శివసేన పార్టీ ఎమ్మెల్యే, సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి రూ.11 లక్షలు బహుమానం ఇస్తానని బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Also read: