మూడేండ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka,) భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ వారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఎస్ ఎల్బీసీ టన్నెల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే గ్రావిటీపై నీరొచ్చే ఎస్ఎల్బీసీపై కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. గోదావరిపై కాళేశ్వరం నిర్మించడంపైనే ప్రధానంగా శ్రద్ధ పెట్టారని అన్నారు. ఇది చరిత్రలోనే నిలిచి పోయే రోజన్నారు. ఇవాళ్టి నుంచి ప్రాజెక్ట్ పనులు వేగం కాబోతున్నాయని చెప్పారు. కేవలం 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని కేసీఆర్ విస్మరించాని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. 2027 సెప్టెంబర్ 20 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి రైతాంగానికి నీరందిస్తామని వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చి వేసుకొని కూర్చొని నల్లగొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి కాలయాపన చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఆయన ఇంట్లో కూర్చున్నారని అన్నారు. ప్రజాప్రబుత్వం కేవలం 30 నెల్లలోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని అన్నారు.

Also read: