పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీలీల(Sreeleela) . ప్రస్తుతం తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించి అందరినీ కట్టిపడేసింది. కుర్చీ మడత సాంగ్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఒక్క ఊపు ఊపేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. శ్రీలీల(Sreeleela) ప్రేమలో పడినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శ్రీలీల(Sreeleela).. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం చదువు, సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది. త్వరలోనే తన ఎంబీబీఎస్ పూర్తవుతుందని చెప్పింది. సినిమాల్లో నటిస్తూనే చదువుపై ధ్యాస పెట్టినట్టు చెబుతోందీ అమ్మడు.
Also read :
Lalbaugcha Raja : ఈ గణేశుడు.. కోటీశ్వరుడు
Iphone: ఐ ఫోన్ 16 మస్త్, యాపిల్ ఇంటెలిజెన్స్ సూపర్

