మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం వాటరా? లేక ఎల్లంపల్లి నీళ్లా? అనేది హరీశ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్లో పొన్నం (Ponnam Prabhakar)మీడియాతో మాట్లాడుతూ ‘హరీశ్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడేతత్వం ఉంది.

అబద్ధాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీశ్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. ఇరిగేషన్ మాజీ మంత్రిగా హరీశ్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు. కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది. ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు మల్లన్న సాగర్ వద్ద షో చేస్తున్నరు’ అని మండిపడ్డారు.
Read more :
BRS : పీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

