మున్సిపల్ శాఖ పరిధిలోని అమృత్ టెండర్లలో రూ.8,800 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. సీఎం రేవంత్ కుటుంబీకుల అక్రమాలను నిగ్గు తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ ‘అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారు.
సీఎం బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ.1,137 కోట్ల పనులు అప్పగించారు. రూ.2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ.1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా? ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి తాగునీటి సరఫరా పనులను దక్కించుకున్నరు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలి. లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని రుజువు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం’’ అని కేటీఆర్(KTR) అన్నారు.
Also read :
Ponnam Prabhakar : హరీశ్.. షో చెయ్యకు
BRS : పీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

