ఆర్టీసీ(RTC) సిబ్బందిపై దాడి చేస్తే రౌడీ షీట్ తెరుస్తం ఆర్టీసీ (RTC) సిబ్బందిపై దాడి చేస్తే.. నిందితులపై రౌడీషీట్స్ తెరుస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవర్ గణేశ్‌ను ఆయన పరామర్శించారు. గాయపడ్డ డ్రైవర్‌కు ఆర్టీసీ పూర్తిగ అండగా ఉంటుందన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డ్రైవర్ కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఆ కారణంగా డ్రైవర్‌పై దాడి చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్చేసిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజల మధ్య డ్యూటీలు చేసే ఆర్టీసీ (RTC) సిబ్బందిపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలపై ఆర్టీసీ (RTC) సీరియస్‌గా వ్యవహిస్తుందన్నారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also read :
KTR : అమృత్ టెండర్లలో రూ.8,800 కోట్ల అవినీతి
Ponnam Prabhakar : హరీశ్.. షో చెయ్యకు

