Harish rao: రాష్ట్రంలో గూండాల రాజ్యం

రాష్ట్రంలో ప్రజాపాలన కాదు గూండాల రాజ్యం నడుస్తోందని.. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయపడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish rao) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు కారణమన్నారు. మెదక్​జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో హరీశ్ (Harish rao) మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ‘మొన్న సిద్దిపేటలో నా కార్యాలయంపైన దాడి, నిన్న హైదరాబాద్​లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై అటాక్, ఇవాళ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చూస్తుంటే ఈ రాష్ట్రంలో గూండాల రాజ్యం తలపించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ మరో బీహార్ గా మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. గోమారంలో గొడవ జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తం’ అని హెచ్చరించారు.

Also read: