శ్రీవారి లడ్డూ (Srivari Ladoo) తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలకు దిగింది. తిరుమల వెంకన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో మొత్తం నాలుగు కంపెనీల నుంచి కేంద్రం నమూనాలను సేకరించి ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఓ కంపెనీ పంపిన నెయ్యిలో కల్తీని అధికారులు గుర్తించారు. దీంతో తిరుమలకు కల్తీ నెయ్యి పంపినందుకుగాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తోందని అధికారులు తెలిపారు. దీంతో కల్తీ నెయ్యిని సరఫరా చేసి, భద్రతా నియమాలను ఉల్లఘించారని అందుకే కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టినట్టు కంపెనీ ప్రతినిధులకు టీటీడీ ఈవో శ్యామలరావు సమాచారమిచ్చారు. నోటీసులపై త్వరగా సమాధానమివ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలకు దిగింది. తిరుమల వెంకన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో మొత్తం నాలుగు కంపెనీల నుంచి కేంద్రం నమూనాలను సేకరించి ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఓ కంపెనీ పంపిన నెయ్యిలో కల్తీని అధికారులు గుర్తించారు. దీంతో తిరుమలకు కల్తీ నెయ్యి పంపినందుకుగాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తోందని అధికారులు తెలిపారు. దీంతో కల్తీ నెయ్యిని సరఫరా చేసి, భద్రతా నియమాలను ఉల్లఘించారని అందుకే కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టినట్టు కంపెనీ ప్రతినిధులకు టీటీడీ ఈవో శ్యామలరావు సమాచారమిచ్చారు. నోటీసులపై త్వరగా సమాధానమివ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also read: