Siddaramaiah: ముడా స్కాంలో సిద్ధరామయ్యకు చుక్కెదురు

Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు (Siddaramaiah) హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సవాలు చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. సీఎం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు ఈ రోజుకు తీర్పు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, అందుకు సిద్ధరామయ్య అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు గత నెల 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు దరిమిలా కర్ణాటక రాజకీయాలు మరో మారు వేడెక్కనున్నాయి. ముఖ్యమంత్రిపై త్వరలోనే విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.Siddaramaiah to be Karnataka CM? Supporters celebrate amid appointment  reports | Today News

కర్ణాటక ముఖ్యమంత్రి  (Siddaramaiah)సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సవాలు చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. సీఎం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు ఈ రోజుకు తీర్పు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, అందుకు సిద్ధరామయ్య అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు గత నెల 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు దరిమిలా కర్ణాటక రాజకీయాలు మరో మారు వేడెక్కనున్నాయి. ముఖ్యమంత్రిపై త్వరలోనే విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.

Also read: