సమంత( Samantha) చివరిగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్-హనీ బన్నీ’.డీకే రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ నవంబర్‌లో ‘సిటడెల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ‘‘మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఆమెతో కలిసి సమంత దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ఆ ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సిరీస్ లలో ‘సిటడెల్’ ఒకటి. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దీని ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్, సమంత (Samantha) ప్రధాన పాత్రలు పోషించారు. ‘సిటడెల్: హనీ-బన్నీ’పేరుతో త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
సమంత చివరిగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్-హనీ బన్నీ’.డీకే రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ నవంబర్‌లో ‘సిటడెల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ‘‘మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఆమెతో కలిసి సమంత దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ఆ ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సిరీస్ లలో ‘సిటడెల్’ ఒకటి. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దీని ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. ‘సిటడెల్: హనీ-బన్నీ’పేరుతో త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
Also read:

