Drugs: జీవితం ఎంతో విలువైనది

ఎంతో మంది యువత డ్రగ్స్ (Drugs) కు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్టార్​హీరో ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే ఫ్రెండ్స్ ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ (Drugs) రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించండి’ అని కోరారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్​పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు. దీంతో ‘దేవర’ రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ ఈ వీడియో చేశారు.

ALSO READ :