యువత కోసం రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచార, పౌరసంబంధాలశాఖ (Ponguleti) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం అనేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఈ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (పీఎంకేవీవై 4.0) పథకం కింద “స్వచ్చత హి సేవా” ఈవెంట్ యూసఫ్ గూడలో జరగ్గా మంత్రి (Ponguleti) పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి ఈ ప్రభుత్వం స్కిల్ యునివర్సిటిని ఏర్పాటు చేసిందని ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణాను తీర్చిదిద్ది, స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను, సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ ధ్యేయంతోనే హైదరాబాద్ లో పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యంతో “తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని” స్థాపించిందన్నారు. వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే 17 రకాల సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసిందని, ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తామన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మారుస్తున్నామని, ఇందుకు అనుగుణంగా తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో పదేళ్లపాటు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుందన్నారు. రూ. 2,324 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐలను ఏటీసీలుగా మార్చబోతున్నామని ప్రకటించారు. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి ఈ ప్రభుత్వం స్కిల్ యునివర్సిటిని ఏర్పాటు చేసిందని ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణాను తీర్చిదిద్ది, స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను, సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ ధ్యేయంతోనే హైదరాబాద్ లో పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యంతో “తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని” స్థాపించిందన్నారు. వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే 17 రకాల సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసిందని, ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తామన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మారుస్తున్నామని, ఇందుకు అనుగుణంగా తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో పదేళ్లపాటు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుందన్నారు. రూ. 2,324 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐలను ఏటీసీలుగా మార్చబోతున్నామని ప్రకటించారు. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయన్నారు.
Also read:

