తమిళనాడు (Tamil Nadu)లోని విరుద్ నగర్ జిల్లా చతుర్ వద్ద ఓ పటాకుల ఫ్యాక్టరీలో ఇవాల తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఐదు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానలున్నాయి. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. దీపావళి పండుగ కోసం భారీ ఎత్తున బాణాసంచా నిల్వచేసినట్టు తెలుస్తోంది. దీంతో పేలుడు శబ్దాలు కొన్ని గంటల పాటు వచ్చాయని స్థానికులు తెలిపారు.
సెల్ ఫోన్ల పరిశ్రమలో..
కృష్ణగిరి జిల్లా హోసూరులోని ఓ మొబైల్ ఫోన్ల కంపెనీలోనూ ఇవాళ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కంపెనీలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మంటలు కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Also read: