Ranganath: ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం

Ranganath

నగరానికి వచ్చే వరదలను తగ్గించేందుకే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఉపక్రమించిందని హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ చెప్పారు. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోతున్న ఏ ఒక్కరికీ నష్టం జరగబోనివ్వమని అన్నారు. హైదరాబాద్ లో వాటర్ ల్యాగింగ్స్ అరికట్టేందుకు మూసీ కెపాసిటీ పెంచనున్నామని వివరించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. నిజాం నవాబు అప్పుడు పునరావాస చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి ఉందని, వేగంగా పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అననారు. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మూసీ సుందరీకరణ అనేది ప్రక్షాళనలో భాగం మాత్రమేనని అన్నారు. రివర్ బెడ్ లో ఉన్న ప్రజల కోసం తాము ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లండన్ తీసుకు వెళ్లి అక్కడి థేమ్స్ నదిని చూపించాలనుకుంటున్నామని, అక్టోబర్ లో వెళ్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో మోస్ట్ హ్యాపెనింగ్స్ సిటీగా వృద్ధి చెందుతోందని, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రక్షాళన చేపట్టినట్టు చెప్పారు. 80 బిలియన్ డాలర్ల నగరంలో 250 బిలియన్ డాలర్ల సిటీగా వృద్ది చెందబోతోందని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఉస్మానియా ఆస్పత్రిని, హైకోర్టును, సిటీ కాలేజీని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామన్నారు. గోల్కొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని చెప్పారు.Image

నగరానికి వచ్చే వరదలను తగ్గించేందుకే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఉపక్రమించిందని హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ చెప్పారు. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath)తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోతున్న ఏ ఒక్కరికీ నష్టం జరగబోనివ్వమని అన్నారు. హైదరాబాద్ లో వాటర్ ల్యాగింగ్స్ అరికట్టేందుకు మూసీ కెపాసిటీ పెంచనున్నామని వివరించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. నిజాం నవాబు అప్పుడు పునరావాస చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి ఉందని, వేగంగా పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అననారు. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మూసీ సుందరీకరణ అనేది ప్రక్షాళనలో భాగం మాత్రమేనని అన్నారు. రివర్ బెడ్ లో ఉన్న ప్రజల కోసం తాము ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లండన్ తీసుకు వెళ్లి అక్కడి థేమ్స్ నదిని చూపించాలనుకుంటున్నామని, అక్టోబర్ లో వెళ్తున్నామని వివరించారు.

Also read: