ప్రతి సంవత్సరం అశ్వయూజ్జ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులపాటు (Devi Navaratri) ప్రతి పల్లె పట్టణం జగన్మాత కొలువులో నిమగ్నం అవుతుంది చౌరస్తాల్లో అమ్మవారి మంట పాలు వెలుస్తాయి. హోమాలు, యజ్ఞాలు,చండీయాగాలు దుర్గాదేవి దీక్షలు అమ్మవారి భక్తులంతా తన్మయత్వంలో మునిగిపోతారు.
అలాంటి మంగళకరమైన రోజులు రాని వచ్చేశాయి గురువారం నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం అంగరంగ వైభవంగా ముస్తాబయింది. అలంపూర్ జోగులాంబ ఆలయంలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
సమస్త భూమండలానికి నాభి క్షేత్రం గా బాసిల్లుతున్న శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ దేవి నవరాత్రి ఉత్సవాలకు శ్రీగిరి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని తొమ్మిది రోజులపాటు వివిధ అలంకరణలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం అనవాయితీ. 9 రోజులపాటు ఏ ఏ అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారో తెలుసుకుందాం..
యదేవి సర్వభూతేషు
బుద్ధి రూపేన సంస్థిత
యదేవి సర్వభూతేషు
శక్తి రూపేన సంస్థిత
అమ్మలగన్నయమ్మ
మువురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ
కడుపారడి బుచ్చినయమ్మ
దుర్గ మాయమ్మ
తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.
మరుసటి రోజు అంటే శుక్రవారం అక్టోబర్ 4వ తేదీ గాయత్రీ దేవిగా పంచముఖాలతో భక్తులను అనుగ్రహించనున్నారు.

మూడవరోజు ఐదో తేదీ శనివారం చేతిలో అమృత భాండాగారం ధరించిన ఆకలి తీర్చే తల్లిగా కొసరి కొసరి వడ్డిస్తూ అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించనున్నారు.

ఐదవ రోజు అంటే ఆదివారం రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా చేతులు చెరుకు గడలు ధరించి ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువుదీరి ఉండగా సింహాసనం పై అధిష్టించి షోడశోపచార దేవతగా భక్తులను అనుగ్రహించనున్నారు.

పంచమి రోజు అంటే సోమవారం ఏడవ తేదీ మహా చండీ దేవిగా తామస రూపంలో అనుగ్రహించనున్నారు.

8వ తేదీ ఆశీర్వ పంచమి మంగళవారం రోజు మహాలక్ష్మి దేవిగా సిరుల వర్షం కురిపించారు.

9వ తేదీ సప్తమి రోజు ధవళ వస్త్రధారణీయై చేతిలో వీణతో సకల విద్యలకు అధి దేవతగా శాంతస్వరూపంతో భాండాగరాన్ని అందించే సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు.

8వ రోజు కనకదుర్గాదేవిగా కరుణించనున్నారు. తొమ్మిదవ రోజు మహిషాసురునిమర్దించి కపాల మాల ధరించి ఉగ్రరూపంలో భక్తులపై కరుణారస వీక్షణాలను ప్రసరింపజేస్తూ మహిషాసుర మర్దినిగా అనుగ్రహించనున్నారు.

విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహించి తాను కాపాడుతానని అభయం ఇవ్వనున్నారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆపదలు రాకుండా ఆ జగన్మాత చూస్తారని భక్తుల నమ్మకం. ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలు మీరు కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మీ శనార్తి కోరుకుంటుంది.
Also read:

