Kamal: ఇండియాన్–3 వస్తుందా?

విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal), డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ఇండియాన్–2 విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. ఇప్పుడు ఇండియన్–3 వస్తుందనే టాక్ మొదలైంది. అయితే ఇండియాన్ –3 మూవీని డైరెక్టుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. (Kamal)ఇందు కోసం నిర్మాణసంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతోందని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సోషల్‌ మీడియాలో కొన్ని పోస్ట్‌లు షేర్‌ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు నిర్మాణసంస్థ, నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటివరకు స్పందించలేదు. భారతీయుడు–2 లో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్‌, ప్రియా భవానీశంకర్‌, బ్రహ్మానందం, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. స‌మాజంలోని అవినీతి, అన్యాయాల్ని రూపుమాపడానికి సేనాపతి ఏం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మేకింగ్‌పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉన్నందున అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ALSO READ :