సూపర్ స్టార్ రజినీకాంత్(Rajini) రేపు చెన్నయ్ లోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటన్ విడుదల చేశాయి. గత నెల 30 ఛాతీ నొప్పి రావడంతో ఆయనను(Rajini) అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం, గుండె నుండి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. ట్రాన్స్ కాథెటర్ విధానం ద్వారా చికిత్స చేసి స్టెంట్ అమర్చారు. వైద్యుల సూచన మేరకు అప్పటి నుండి అబ్జర్వేషన్లో ఉన్నారని, త్వరగానే కోలుకుంటున్నారని రజినీకాంత్ భార్య లత వివరాలు వెల్లడించారు. అయితే రజినీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండటంతో రేపు ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు తమ అభిమాన నటుడు రజినీకాంత్ అనారోగ్యం పాలయ్యారని తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని వారంతా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
Also Read :

