మేడారం మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత మాలేం మల్లేశం(Mallesham) ఇంట్లో చోరీ జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే ఇంటికి దుండగులు కన్నం వేశారు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు ఇంటి వెనుక వైపు లోనికి చొరబడి దొంగతనం చేశారు. ఇంట్లో నుంచి 13 తులాల గోల్డ్, రూ. 50 క్యాష్‌ను ఎత్తుకెళ్లారు. దసరా సందర్భంగా షాపింగ్చేసేందుకు హైదరాబాద్ కు మల్లేశం(Mallesham) కుటుంబసభ్యులు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్టీమ్వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమోరాలను పరిశీలిస్తున్నారు.
Also Read :

