ఢిల్లీలో హైకమాండ్ బిజీగా ఉండటం వల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని PCC పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. దసరా తర్వాత తప్పకుండా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని అన్నారు. మూసీ ప్రక్షాళనకు రూ. వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన వేరు, సుందరీకరణ వేరని అన్నారు. సుందరీకరణ కోసం డీపీఆర్ రావాల్సి ఉందని చెప్పారు 18 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మూసీ నిర్వాసితులకు కేటాయించామని వివరించారు. మెజార్టీ ప్రజలు మూసీ ప్రక్షాళన కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాటిమాటికి ప్రభుత్వాన్ని పడగొడ్తామని బెదిరిస్తున్నారని, అందుకే తమకు ఎంఐఎం ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. రాష్ట్రమంతా పర్యటించిన తర్వాతే PCC పీసీసీ కార్యవర్గాన్ని విస్తరిస్తామని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ రైలు పట్టాల్లాంటివని, అవి ఎప్పుడూ కలవవని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, కవితకు బెయిల్ రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. మంత్రి కొండా సురేఖపై ఎలాంటి చర్యలు ఉండవని, అదంతా తప్పుడు ప్రచారమని తెలిపారు. పీసీసీ జోక్యంతోనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుందని వివరించారు.
ఢిల్లీలో హైకమాండ్ బిజీగా ఉండటం వల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. దసరా తర్వాత తప్పకుండా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని అన్నారు. మూసీ ప్రక్షాళనకు రూ. వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన వేరు, సుందరీకరణ వేరని అన్నారు. సుందరీకరణ కోసం డీపీఆర్ రావాల్సి ఉందని చెప్పారు 18 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మూసీ నిర్వాసితులకు కేటాయించామని వివరించారు. మెజార్టీ ప్రజలు మూసీ ప్రక్షాళన కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాటిమాటికి ప్రభుత్వాన్ని పడగొడ్తామని బెదిరిస్తున్నారని, అందుకే తమకు ఎంఐఎం ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. రాష్ట్రమంతా పర్యటించిన తర్వాతే పీసీసీ కార్యవర్గాన్ని విస్తరిస్తామని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ రైలు పట్టాల్లాంటివని, అవి ఎప్పుడూ కలవవని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, కవితకు బెయిల్ రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. మంత్రి కొండా సురేఖపై ఎలాంటి చర్యలు ఉండవని, అదంతా తప్పుడు ప్రచారమని తెలిపారు. పీసీసీ జోక్యంతోనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుందని వివరించారు.
Also read:

