మూసీ పునరుద్ధరణ అవసరం లేందంటే అదే నీళ్లతో స్నానం చేయాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ (MP Kiran Kumar) రెడ్డి సవాలు విసిరారు. మూసీ పునర్జీవాన్ని వ్యతిరేకించే నాయకుల లాగులు ఊడబీకుతామని హెచ్చరించారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీని అడ్డుకుంటే రోడ్లమీద తిరగనీయమని అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ఉద్యమం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు మతి భ్రమించిందని, పాత బాస్ లు కేటీఆర్, హరీశ్ రావును అనుసరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ హౌలా మాటలు మాట్లాడారని మండిపడ్డారు.
లక్షన్నర కోట్లు అనే పదాన్ని పట్టుకొని బావ, బావమర్దులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది పదేండ్ల పాలనకు, పది నెలల సర్కారుకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. పేదలు మురికి కూపంలో మగ్గాలనే బీఆర్ఎస్ సర్కారు ప్రక్షాళన చేయలేదని అన్నారు. భువనగిరి ప్రజలకు మూసీ జీవనది అని, ఈ కలుషిత నీళ్ల వల్ల మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ పునరుద్ధరణ అవసరం లేందంటే అదే నీళ్లతో స్నానం చేయాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ (MP Kiran Kumar) రెడ్డి సవాలు విసిరారు. మూసీ పునర్జీవాన్ని వ్యతిరేకించే నాయకుల లాగులు ఊడబీకుతామని హెచ్చరించారు.
ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీని అడ్డుకుంటే రోడ్లమీద తిరగనీయమని అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ఉద్యమం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు మతి భ్రమించిందని, పాత బాస్ లు కేటీఆర్, హరీశ్ రావును అనుసరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ హౌలా మాటలు మాట్లాడారని మండిపడ్డారు. లక్షన్నర కోట్లు అనే పదాన్ని పట్టుకొని బావ, బావమర్దులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇది పదేండ్ల పాలనకు, పది నెలల సర్కారుకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. పేదలు మురికి కూపంలో మగ్గాలనే బీఆర్ఎస్ సర్కారు ప్రక్షాళన చేయలేదని అన్నారు. భువనగిరి ప్రజలకు మూసీ జీవనది అని, ఈ కలుషిత నీళ్ల వల్ల మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read:KKCR

