గ్రూప్ –1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాలేదని, అత్యవసరంగా పిటిషన్ పై విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మోహిత్ రావు స్పెషల్ మెన్షన్ చేశారు. అయితే విచారణకు స్వీకరించిన సీజేఐ బెంచ్ సోమవారం (21న) ఉదయం విచారిస్తామని తెలుపుతూ వాయిదా వేసింది. అదే రోజు (Group-1) గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల హైకోర్టు గ్రూప్ –1 వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పలువురు అభ్యర్థులు భేటీ అయ్యారు. అనంతరం గాంధీభవన్ కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు. ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఇవాళ పలువురు గ్రూప్ –1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

గ్రూప్ –1 (Group-1) పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాలేదని, అత్యవసరంగా పిటిషన్ పై విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మోహిత్ రావు స్పెషల్ మెన్షన్ చేశారు. అయితే విచారణకు స్వీకరించిన సీజేఐ బెంచ్ సోమవారం (21న) ఉదయం విచారిస్తామని తెలుపుతూ వాయిదా వేసింది. అదే రోజు -)గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Also read: