Minister Sitakka: 2 లక్షల రుణం లక్షా 40 వేలు మాఫీ

Minister Sitakka

మూసీ పరీవాహక ప్రాంతంంలోని నిర్వాసిత కుటుంబాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క (Minister Sitakka) వడ్డీలేని రుణాలు అందించారు. 17 సంఘాల్లోని 172 మంది మహిళలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం 3.44 కోట్ల రూపాయలను అందజేశారు. ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రుణాలు పొందిన వారు 1. 40 వేలు చెల్లించాల్సిన అవసరం లేదని, మిగతా 60 వేలు వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ రుణాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పునరావాసం పొందిన వారి పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందించనుందని చెప్పారు.

Seethakka - Wikipediaఇప్పటికే 286 కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిందని అన్నార. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్న మహిళలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెన్నయ్ నగరం మునిగిపోయిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దనే మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మూసీ కాలుష్యం వల్ల అక్కడ నివసించే వారి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. భవిష్యత్ లో మూసీ నీటిని తాగడానికి, ఉపయోగించుకునేలా ఉండాలన్నదే తమ సంకల్పమని వివరించారు.

Anasuya Dansari (Seethakka) | Mulugu MLA | Telangana | INCమహిళా గ్రూప్ లకు 17 రకాల వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు చూపిస్తామని తెలిపారు. త్వరలో కుట్టు మిషన్లు కూడా ఇస్తామని వివరించారు. ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ కుట్టేందుకు తొలి ప్రాధాన్యత మూసీ నిర్వాసిత మహిళలకే ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో మలక్ పేట ఎమ్మెల్యే బలాల తదితరులు పాల్గొన్నారు.

మూసీ పరీవాహక ప్రాంతంంలోని నిర్వాసిత కుటుంబాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క (Minister Sitakka) వడ్డీలేని రుణాలు అందించారు. 17 సంఘాల్లోని 172 మంది మహిళలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం 3.44 కోట్ల రూపాయలను అందజేశారు. ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రుణాలు పొందిన వారు 1. 40 వేలు చెల్లించాల్సిన అవసరం లేదని, మిగతా 60 వేలు వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ రుణాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పునరావాసం పొందిన వారి పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందించనుందని చెప్పారు. ఇప్పటికే 286 కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిందని అన్నార.

From Maoist To Minister: Seethakka, A Legacy Unparalleled | TimelineDailyఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్న మహిళలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెన్నయ్ నగరం మునిగిపోయిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దనే మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మూసీ కాలుష్యం వల్ల అక్కడ నివసించే వారి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. భవిష్యత్ లో మూసీ నీటిని తాగడానికి, ఉపయోగించుకునేలా ఉండాలన్నదే తమ సంకల్పమని వివరించారు. మహిళా గ్రూప్ లకు 17 రకాల వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు చూపిస్తామని తెలిపారు. త్వరలో కుట్టు మిషన్లు కూడా ఇస్తామని వివరించారు. ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ కుట్టేందుకు తొలి ప్రాధాన్యత మూసీ నిర్వాసిత మహిళలకే ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో మలక్ పేట ఎమ్మెల్యే బలాల తదితరులు పాల్గొన్నారు.

Also read: