Harish rao : మల్లన్న సాగర్ పోదాం పద

మల్లన్న సాగర్ పోదాం పద
సీఎం రేవంత్ కు హరీశ్ సవాల్
సీఎం రేవంత్​రెడ్డి సవాల్​కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు (Harish rao) కౌంటర్​వేశాడు. సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ను తాను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ‘
సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9గంటలకు నేను సిద్దం. ఫస్ట్​ మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్అండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కు మీదకు పోదాం. అక్కడే కూర్చొని బాధితులతో మాట్లాడుదాం. సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 2013చట్టాన్ని మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్​ పార్టీ సహాయంతో నేను మంత్రిని అయ్యానని సీఎం అంటుండు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు శిష్యుడుగా రేవంత్​రెడ్డి ఉన్నాడు. గన్​పార్క్​ వద్ద నా వెనుక నిక్కి నిక్కి నిలబడ్డావ్. అది నీ చరిత్ర. 2009లో బీఆర్ఎస్ పొత్తులోనే రేవంత్​రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. బీఆర్ఎస్ అంటే నీకు కృతజ్ఞత ఉండాలి కదా. ’ అని హరీశ్​రావు (Harish rao) అన్నారు.

Also read :

Isha Foundation : ఈషా ఫౌండేషన్ కు క్లీన్ చిట్

Khammam:ఫేస్ బుక్ లో చూసి చైన్ స్నాచింగ్!