Cyber ​​criminals: కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!!

Cyber ​​criminals

సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) ఎవరినీ వదలడం లేదు.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కోర్టులు అందరూ బాధితులే.. సామాన్యుడి నుంచి పొలిటీషియన్స్ దాకా అందరినీ ఇబ్బంది పెడుతూ డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బాధితుల జాబితాలో చేరిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన ఆయన షాక్ కు గురయ్యారు. వెంటనే డిస్ కనెక్ట్ చేసేశారు. వెంటనే నేషనల్‌ (Cyber ​​criminals)సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు.

MLA files complaint after receiving nude video call amid cyber fraud spikeదీంతో ఆ ఫోన్‌నంబర్‌ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్‌ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారా.? అనే సందేహాన్ని సదరు ఎమ్మెల్యే వక్తం చేస్తున్నారు. ఏపీ హైకోర్టు కు సైతం ఇదే సమస్య ఎదురైంది. ఈ నెల15వతేదీన కిట్టు అనే వ్యక్తి పేరుతో ఓ వ్యక్తి మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ యాప్‌ ద్వారా 17వ కోర్టులోకి జొరబడ్డాడు. బట్టలు లేకుండా మంచంపై పడుకుని మాట్లాడుతూ కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని బ్లాక్‌ చేశారు. ఘటనపై హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఓ మాజీ ఐఏఎస్ అధికారికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయనకు ఓ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు.

Cyber criminals hack into server of Noida bank, steal Rs 16.71 crore - India Today అవతలి వైపు నగ్నంగా ఉన్న ఓ మహిళ కనిపించింది. బట్టలు విప్పేయాలని కోరింది. దానికి నిరాకరించిన ఆయన కాల్ కట్ చేశాడు. ఇంకేముంది.. తెల్లవారే సరికి ఆయన వాట్సాప్ కు ఓ వీడియో వచ్చింది. అందులో ఆయన ఓ మార్ఫింగ్ వీడియోకు సదరు మాజీ ఐఏఎస్ అధికారి ఫొటోను యాడ్ చేశారు. అర్జంటుగా రూ. 25IA వేల రూపాయలు పంపాలని లేకుంటే రచ్చ చేస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. అంతే కాకుండా కాంటాక్ట్ జాబితాలో ఉన్న వాళ్లందరికీ పంపుతామంటూ హెచ్చరించారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Cybercrime unit alerts public on rising fake government e-notice scam - India Todayఈ ఘటన సెప్టెంబర్ 5వ తేదీన చోటు చేసుకుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే ముఖం కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఎదైనా అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Also read: