CM Revanth Reddy: హైడ్రా@ అంకుశం

CM Revanth Reddy

ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు కబ్జా చేసి అక్రమంగా భవంతులు నిర్మించుకున్న వారి పట్ల హైడ్రా అంకుశంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భవనా యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మూసీ పునురుజ్జీవం వేరు.. హైడ్రా వేరని పునరుద్ఘాటించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చాలని ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి నిర్మించుకున్న భవనాలను వదలిపెట్టబోమని, అదే విధంగా అనుమతులతో నిర్మించుకున్న వాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వాటిని అధికారులకు చూపిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని చెప్పారు.

Image

గండిపేట చెరువులో ఆక్రమించుకొని ఫాంహౌస్ లు
కట్టుకున్న వాళ్లు పేదలు కాదని పెద్దోళ్లని అన్నారు. వాళ్లు వదిలే డ్రైనేజీ నీళ్లు నగర ప్రజలు తాగాలా..? అని సీఎం ప్రశ్నించారు. ‘ఈ గాడిదల బలుపు చూడండి.. మీ డ్రైనేజీ నీళ్లు మా తాగు నీళ్లల కలుపుతుండ్రు కదా.. మిమ్మల్ని చెరువుల్లో వేసి తొక్కుతం.. మిమ్నల్ని వంగపెట్టి పోలీసు స్టేషన్ లో బట్టలిప్ప దీసి కొట్టాలె.! ’ అంటూ ఫైర్ అయ్యారు. ఫాంహౌస్ లు కాపడుకునేందుకు హరీశ్ రావు, కేటీఆర్ మూసీపై నాటకాలు స్టార్ట్ చేశారని మండిపడ్డారు. అందుకే బుల్డోజర్లకు అడ్డంపండుకుంటమని హరీశ్, కేటీఆర్ అంటున్నారని అన్నారు. ‘ఎవరొస్తరో రండ్రి.. నువ్వొస్తవా..? ఫాంహౌస్ లో బోర్లా పండుకున్నోడు వస్తడా రండ్రి.. బుల్డోజర్లు రెడీ పెట్టినం.. నడిపేందుకు మావోళ్లు రెడీ ఉన్నరు’ అంటూ ఫైర్ అయ్యారు. ‘నీ ఫాంహౌస్ కాడికి రమ్మంటవా..? ఎప్పుడు రమ్మంటవో చెప్పు అప్పుడే వస్త’ అంటూ హరీశ్ రావుకు సవాలు విసిరారు. బిళ్లా రంగాల దొంగనాటకాలు సాగవని అన్నారు. అజీజ్ నగర్ లో హరీశ్ రావు, జన్వాడలో కేటీఆర్ చెరువులను ఆక్రమించే ఫాంహౌస్ లు కట్టుకున్నారని అన్నారు. ‘కేటీఆర్.. 111 జీవో ఉల్లంఘించి 50 ఎకరాల్లో భవంతి కట్టుకున్నవా లేదా..? హరీశ్ రావు.. ముల్కాపూర్ నాళాను ఆక్రమించి ఫాంహౌస్ కట్టుకున్నవా లేదా..?’సమాధానం చెప్పాటని డిమాండ్ చేశారు. వాటి నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ వేస్తామని (CM Revanth Reddy) సీఎం చెప్పారు. హరీశ్ ‘నేను నీలా చెప్పులు మోసేటోన్ని కాదు.. నా ఇంటి ముందు వచ్చి చేతులు కట్టుకొని బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయినవా.. చెప్పులు కొనుక్కోవాలనుకున్నా.. నా ఇంటికి వచ్చి అడుకున్న సంగతి యాదికి లేదా..?’ అని ప్రశ్నించారు.

Image
మూసీ ప్రజలను ఒప్పంచకుండా ముందుకెళ్లం
ప్రభుత్వం మూసీ రివర్ బెడ్ లో ఉన్న ప్రజలను ఒప్పించకుండా ఎలాంటి చర్యలూ తీసుకోదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మురికి పక్కన నివసిస్తున్న కుటుంబాలకు గత ప్రభుత్వం దాచిపెట్టుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పంచుతున్నామని చెప్పారు. వారి దారి ఖర్చుల కోసం రూ. 25 వేల చొప్పున ఇస్తున్నామని అన్నారు. వాళ్ల రేకులు ఇండ్లు కూలగొట్టేందుకు బుల్డోజర్లు అవసరం లేదని, వారే స్వచ్ఛందంగా కూల్చేసుకొని తలుపులు, కిటికీలు తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళుతున్నారని అన్నారు. ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన హామీ మేరకు భోజగుట్ట ప్రజలకు కూడా మేలు చేస్తామని సీఎం అభయం ఇచ్చారు. వారికి కూడా ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.

Also read: