గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అభ్యర్థులతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి (Bandi Sanjay Kumar)_బండి సంజయ్ కుమార్ అశోక్‌నగర్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభ్యర్థులు భారీగా తరలివచ్చి బండి సంజయ్ కి విషయాన్ని వివరించారు. అనంతరం వారితో కలిసి సంజయ్ పాదయాత్రగా సచివాలయానికి బయల్దేరారు. ఈ ర్యాలీని లిబర్టీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకు వెళ్తున్నామని చెప్పారు.
సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు (Bandi Sanjay Kumar)బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకొని.. బీజేపీ ఆఫీసు వద్ద వదిలి పెట్టారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్ కి ఫోన్ వచ్చింది. జీవో నెం.29 గురించి చర్చిద్దామని చెప్పారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నేతలు గ్రూపు-1 అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపడుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు బీఆర్ఎస్ నేతలారా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు గ్రూపు-1 అభ్యర్థుల ఆందోళనతో సచివాలయం వద్ద పోలీసులు భారీ మోహరించారు. గ్రూపు-1 అభ్యర్థులు సచివాలయం వద్దకు చేరుకున్నారు.
పోలీసులు, గ్రూపు-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కాస్త ట్రాఫిక్ జామ్ అయింది. బిజెపి మహిళా లీడర్లను, ఏబీవీపీ లీడర్లను అదుపులోకి తీసుకుని గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు.
Also read:

