ముందు తమపైకి బుల్డోజర్లు తీసుకురావాలని, ఆ తర్వాతే పేదల ఇండ్లు కూల్చాలని కేంద్ర (Minister Kishan Reddy)మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నదికి ముందుగా రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. ఇవాళ మూసీ పరీవాహక ప్రాంతాలైన రాందేవ్ గూడ, బాపునగర్, కేసరినగర్ లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక సంవత్సరాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న పేదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పందన్నారు.
సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఇండ్లకు మార్కింగ్ చేయడం సరికాదని విమర్శించారు. లక్షా యాబైవేల కోట్లు ఖర్చు చేస్తామంటున్న సీఎం ముందుగా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని అన్నారు. పేదవాడి ఇల్లు కూల్చి సుందరీకరణ చేస్తామంటే బీజేపీ ఊరుకోబోదని అన్నారు. ఇక్కడి ప్రజలెవ్వరూ తమకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలకు పాల్పడుతోందని (Minister Kishan Reddy) అన్నారు.
ప్రాణాలకు తెగించైనా పేదల ఇండ్ల కూల్చివేతలను మేం అడ్డుకుంటామని చెప్పారు. పేదలను ఈ ప్రాంతం నుంచి వేరు చేస్తామంటే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో కేసీఆర్ మూసీని కొబ్బరి నీళ్లతో నింపుతామని చెప్పి అడ్రస్ లేకుండా పోయారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మూసీ సుందరీకరణను ఎత్తుకున్నారని అన్నారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ డ్రైనేజీ నీళ్లను మూసీలో కలుపుతున్నాయని ఆరోపించారు. డ్రైనేజీ మళ్లింపు డైవర్షన్ లేకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని అన్నారు.

Also read: