: MLA Harish Raoసీఎం సారీ చెప్పాలె

MLA Harish Rao

ఈ ఖరీఫ్​సీజన్​లో రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు చావు కబురు చల్లగా చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు (MLA Harish Rao) అన్నారు. ఇవాళ సిద్దిపేటలో ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.. మాట తప్పినందుకు సీఎం రేవంత్​రెడ్డి ముక్కు నేలకు రాసి, రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ‘ మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో మోసం చేశారు. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గ్రూప్-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి . గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్ కు వినిపించటం లేదా? జీవో 55 ను రద్దు చేశారు..? రాహుల్​ గాంధీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు.

ఇక్కడ రేవంత్​ రెడ్డి పాలనాలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్​ అన్ని వర్గాలను మోసం చేస్తోంది.’ అని హరీశ్​రావు అన్నారు.

హరీశ్​కు నిరసన సెగ.. గో బ్యాక్​నినాదాలు
సిద్దిపేట: సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మాజీ (MLA Harish Rao) మంత్రి హరీశ్​రావుకు నిరసన సెగ తలిగింది. ఇవాళ నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్​పామ్​రైతుల అవగాహన ప్రోగ్రాం వచ్చిన హరీశ్​రావును గ్రామస్థులు అడ్డుకున్నారు.

హరీశ్​రావు డౌన్​డౌన్​, గో బ్యాక్​ హరీశ్​అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కార్యకర్తల మధ్య పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రోగ్రాంను హరీశ్​రావు విరమించుకున్నారు.

హరీశ్​కు నిరసన సెగ.. గో బ్యాక్​నినాదాలు
సిద్దిపేట: సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మాజీ (MLA Harish Rao) మంత్రి హరీశ్​రావుకు నిరసన సెగ తలిగింది. ఇవాళ నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్​పామ్​రైతుల అవగాహన ప్రోగ్రాం వచ్చిన హరీశ్​రావును గ్రామస్థులు అడ్డుకున్నారు.

Also read: