బీఆర్ఎస్ హయంలోనే మూసీకి పునర్జీవం ఆల్రెడీ స్టార్ట్చేశామని, ఇప్పుడు రేవంత్రెడ్డి కొత్తగా చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ నాగోల్లోని ఎస్టీపీ కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్హైదరాబాద్లోనే ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో కేవలం హైదరాబాద్లోని ఎస్టీపీ ప్లాంట్ రోజుకు 2000 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ది చేస్తుందన్నారు. ‘ ఎస్టీపీ పాంట్ కు బీఆర్ఎస్ హయంలో రూ. 3800 కోట్లు ఖర్చు చేసి కట్టినం.
గత పాలకుల పాపం వల్ల మూసీ మురికిగా మారిందని సీఎం అన్నాడు. గత పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీనే కాదా.. ఇందులో మా పాపం లేదు. నల్గొండకు మంచి నీళ్లే పోతున్నారు. మురుగు నీళ్లు పోతలేవు. గోదావరి నీళ్లను మూసీ లో కలుపుదామని రూ.1100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినం. మరో 500 కోట్లతో మూసీ పైన చెక్ డ్యామ్ లతో సుందరీకరణ చేయాలనుకున్నం. దీనికి రూ. 25వేల కోట్లు సరిపోతాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 లక్ష 50 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంటుండు. మూసీ పేరుతో కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపుతున్నాడు. డబ్బులు పంపించాలంటే తలా ఇంత చందాలు వేసి ఇస్తం .మూసీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు ’ అని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ హయంలోనే మూసీకి పునర్జీవం ఆల్రెడీ స్టార్ట్చేశామని, ఇప్పుడు రేవంత్రెడ్డి కొత్తగా చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ నాగోల్లోని ఎస్టీపీ కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్హైదరాబాద్లోనే ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో కేవలం హైదరాబాద్లోని ఎస్టీపీ ప్లాంట్ రోజుకు 2000 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ది చేస్తుందన్నారు. ‘ ఎస్టీపీ పాంట్ కు బీఆర్ఎస్ హయంలో రూ. 3800 కోట్లు ఖర్చు చేసి కట్టినం. గత పాలకుల పాపం వల్ల మూసీ మురికిగా మారిందని సీఎం అన్నాడు. గత పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీనే కాదా.. ఇందులో మా పాపం లేదు. నల్గొండకు మంచి నీళ్లే పోతున్నారు. మురుగు నీళ్లు పోతలేవు.
గోదావరి నీళ్లను మూసీ లో కలుపుదామని రూ.1100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినం. మరో 500 కోట్లతో మూసీ పైన చెక్ డ్యామ్ లతో సుందరీకరణ చేయాలనుకున్నం. దీనికి రూ. 25వేల కోట్లు సరిపోతాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 లక్ష 50 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంటుండు. మూసీ పేరుతో కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపుతున్నాడు. డబ్బులు పంపించాలంటే తలా ఇంత చందాలు వేసి ఇస్తం .మూసీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు ’ అని కేటీఆర్ అన్నారు.
Also read:

