ఎంతో పాపులర్ అయిన వన్ ప్లస్ సిరీస్ లో మరో మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 12 మోడల్ కు కొనసాగింపుగా ఈనెలాఖరులో వన్ ప్లస్ 13 మొబైల్ (Mobile) చైనా మార్కెట్లలోకి అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31న సాయంత్రం 4 గంటలకు మొబైల్ లాంచ్ కానుందని, అందుకు సంబంధించి వన్ ప్లస్ మొబైల్స్ తయారీ సంస్థ మోడల్ లాచింగ్ డేట్, డిజైన్, కలర్ పై అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కోసం అడ్వాన్స్డ్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభంకాగా.. వినియోగదారులకు వన్ ప్లస్ పలు ఆఫర్లను ఇస్తోంది.
ధర
ఎన్నో అధునాతన ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ 13 మొబైర్ ధర దాదాపు రూ. 70 వేల వరకు ఉండొచ్చని అంచనా.
ప్రత్యేకతలు
120 హెడ్జెస్ కలిగిన 6.82 ఇంచుల 2కే 10 బిట్ ఎల్టీపీఓ బీఓఈ ఎక్స్2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లే వచ్చింది.
ప్రాసెసర్
ఈ ఫోన్ లో క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ ను వినియోగించారు. 3236, 10,049 సింగల్ కోర్, మల్టీ కోర్ టెస్ట్ నిర్వహించారు.
స్టోరేజ్
ఇందులో ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ తో కూడిన 24 జీబీ రామ్, 1 టీబీ వరకు డేటా స్టోరేజ్ సదుపాయాన్ని కల్పించారు. 12 జీబీ, 16 జీబీ రామ్ ను కలిగి ఉంది.
కెమెరా
అలాగే 1 టీబీ సోనీ లైట్- 808 ప్రైమరీ సెన్సార్ తో కూడిన 50 మెగాపిక్సెల్స్ కేమెరాను అందించారు. అలాగే 50 మెగా పిక్సెల్ తో కూడిన జెఎన్ 5 ఆల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ సోనీ లైట్ 600 పెరిస్కోప్ లెన్స్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన లెన్స్ ను వాడారు. కెమెరా 4కే 60 ఎఫ్పీఎస్ రిజొల్యూషన్ కలిగి ఉంది.
సాఫ్ట్ వేర్
ఇందులో ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్ వేర్ ను వినియోగించారు. అందులో ఆక్సిజన్ ఓఎస్ 15 ఈ మోడల్ లో టాప్ అని చెప్పొచ్చు. కాలర్ ఓఎస్ 15 ఉన్న ఈ మొబైల్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ కలిగి ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్
6000ఎంఏహెచ్ కలిగిన బ్యాటలీ, 100వాట్స్ కలిగిన ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకత.
ఐపీ రేటింగ్
ఈ ఫోన్ కు వాటర్ వాళ్ల, దుమ్ము వాళ్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సామ్ సంగ్, యాపిల్, వేరే ఇతర ఫోన్ల కంటే బెటర్ గా పనిచేస్తుంది.
కలర్స్, ఇతర ప్రత్యేకతలు
వన్ ప్లస్ 13 మొబైల్ (Mobile) బ్లూ, బ్లాక్, వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. కొద్దిరోజుల తర్వాత బ్లూ కలర్ లో డ్యుయల్ కలర్ అప్పియరెన్స్ రానుంది. అలగే వైట్ కలర్ లో కెమెరా ఐలాండ్ ను రూపొందించనున్నారు. అప్ గ్రేడ్ చేసిన సిస్టమ్ ఎక్స్ పీరియన్స్, గేమ్ పర్ఫామెన్స్, స్క్రీన్ డిస్ ప్లే, ఐ ప్రొటెక్షన్, దీని ప్రత్యేకతలు.
Also read:
- Mahesh Kumar Goud: నిజామాబాద్ కు మరో మెడికల్ కాలేజీ
- Mallareddy: మనుమరాలి పెండ్లిలో మల్లన్న డ్యాన్స్.. అదుర్స్

