త్వరలో వరంగల్ లో 650 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్
వరంగల్ (Warangal) లో రూ. 650 కోట్ల వ్యయంలో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ యూనిట్ ఏర్పాటైతే వ్యాగన్స్, కోచెస్, ఇంజిన్ల ఇక్కడే (Warangal) జరుగుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ ల పురోగతిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని అన్నారు. నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలని కోరామని చెప్పారు. ఇప్పటివరకు 500 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దీంతోపాటు కొల్లూరు, ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే బ్రిడ్జిని అభివృద్ది చేయాల్నారు. మెదక్ నియోజకవర్గంలో అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ పెంచాలని కోరారు. మరోవైపు మనోహరాబాద్ , కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ సమావేశంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కావ్య, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

వరంగల్ లో రూ. 650 కోట్ల వ్యయంలో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ యూనిట్ ఏర్పాటైతే వ్యాగన్స్, కోచెస్, ఇంజిన్ల ఇక్కడే జరుగుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ ల పురోగతిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని అన్నారు. నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలని కోరామని చెప్పారు. ఇప్పటివరకు 500 ఎకరాల భూమిని సేకరించామన్నారు.
దీంతోపాటు కొల్లూరు, ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే బ్రిడ్జిని అభివృద్ది చేయాల్నారు. మెదక్ నియోజకవర్గంలో అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ పెంచాలని కోరారు. మరోవైపు మనోహరాబాద్ , కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ సమావేశంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కావ్య, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Also read:

