Seethaka : నవంబర్​లో జైలుకే

నవంబర్​లో జైలుకే

ల్యాండ్ కబ్జా, ఫోన్ ట్యాపింగ్ చేసినోళ్లను ఎవర్నీ వదలమని, కచ్చితంగా వారు జైలుకు పోవాల్సిందేనని మంత్రి సీతక్క(Seethaka) అన్నారు. దీపావళికి ముందే పటాకులు పేలుతాయన్నారు. మహబూబాబాద్​జిల్లా కొత్తగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్ చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రాష్ట్రాలను దోచుకున్న వాళ్లను విడిచిపెట్టబోం. నవంబర్‌లో కీలక నేతలు తప్పకుండా లోపలికి వెళ్తారు. పాస్​పుస్తకాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. పోడు భూములకు ప్రభుత్వమే పాస్​బుక్స్​ఇస్తుంది’ అని సీతక్క(Seethaka)తెలిపారు.

ALso read :

CM Revanth : దక్షిణాదికి నేనే నాయకత్వం వహిస్తా

Amaravati:ఐదు గంటల్లో పెళ్లి.. వధువు జంప్