ISRO: గగన్ యాన్ @2026

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చరిత్రలో మొట్టమొదటి సారిగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ కు సంబంధించి ఇస్రో(ISRO) చైర్మన్ సోమనాత్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టును ఇంతకుముందు అనుకున్నట్టు 2025లో కాకుండా..

2026లో చేపట్టనున్నామని తెలిపారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. చంద్రయాన్ 3, మిషన్ ఆదిత్య ప్రయోగా4లను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో ఆదే జోరుతో తొలిసారిగా మానవులను అంతరిక్షంలోని పంపే గగన్ యాన్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. నలుగురు వ్యోమగాములను మూడు రోజులు అంతరిక్షంలోకి పంపి, తిరిగి వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడమే ఈ మిషన్ లక్ష్యం.

Also Read :