(delhi) ఢిల్లీలోని షహదారా ఏరియాలో ఘటన జరిగింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఇంటి బయట దీపావళి వేడుకలు జరుపుకుంటున్న 44 ఏళ్ల ఓ వ్యక్తి, అతని మేనల్లుడిపై దుండగులు కాళ్లు మొక్కి అనంతరం కాల్పులు జరిపారు. డబ్బు వివాదానికి సంబంధించి కాల్పులు జరపగా నిందితుడిని, ఓ 16 ఏళ్ల బాలుడిని (delhi) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఆకాష్ శర్మ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (10) ఇంటి బయట వేడుకలు చేసుకుంటుండగా 16 ఏళ్ల బాలుడు బైక్ పై వచ్చి ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కాడు. తర్వాత మరో వ్యక్తి శర్మపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పుల్లో కుమారుడు క్రిష్ గాయపడ్డాడు. నిందితులు పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన మేనల్లుడు రిషబ్ ను దుండుగులు కాల్చేశారు. ఆకాష్ శర్మకు నిందితులు డబ్బు అప్పుగా ఇవ్వగా.. అతడు తిరిగి కట్టలేదని పోలీసులు తెలిపారు. “నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. అదుపులోకి తీసుకున్న మైనర్, బాధితుడు ఆకాష్, అతని కుటుంబంపై గతంలో కేసులు ఉన్నాయి” అని వెల్లడించారు.
ఢిల్లీలోని షహదారా ఏరియాలో ఘటన జరిగింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఇంటి బయట దీపావళి వేడుకలు జరుపుకుంటున్న 44 ఏళ్ల ఓ వ్యక్తి, అతని మేనల్లుడిపై దుండగులు కాళ్లు మొక్కి అనంతరం కాల్పులు జరిపారు. డబ్బు వివాదానికి సంబంధించి కాల్పులు జరపగా నిందితుడిని, ఓ 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఆకాష్ శర్మ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (10) ఇంటి బయట వేడుకలు చేసుకుంటుండగా 16 ఏళ్ల బాలుడు బైక్ పై వచ్చి ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కాడు. తర్వాత మరో వ్యక్తి శర్మపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పుల్లో కుమారుడు క్రిష్ గాయపడ్డాడు. నిందితులు పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన మేనల్లుడు రిషబ్ ను దుండుగులు కాల్చేశారు. ఆకాష్ శర్మకు నిందితులు డబ్బు అప్పుగా ఇవ్వగా.. అతడు తిరిగి కట్టలేదని పోలీసులు తెలిపారు. “నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. అదుపులోకి తీసుకున్న మైనర్, బాధితుడు ఆకాష్, అతని కుటుంబంపై గతంలో కేసులు ఉన్నాయి” అని వెల్లడించారు.
Also read:

