Pushpa-2: పుష్ప–2లో శ్రీలీల ఐటం సాంగ్

ఐటం సాంగ్ లేకుండా సుకుమార్ సినిమా ఉండదు. పుష్ప(Pushpa-2) సినిమాలో సమంత రుతుప్రభుతో ఉ అంటావా మావా.. ఉఊ అంటావా అంటూ వచ్చిన ఐటం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సాంగ్ కారణంగానే అసలు ప్రమోషన్స్ చేయకపోయినా హిందీ డబ్బింగ్ వర్షన్ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది.‘పుష్ప 2: ది రూల్’(Pushpa-2) మూవీలో బాలీవుడ్ హీరోయిన్‌తో ఐటెం సాంగ్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి. ‘యానిమల్’ మూవీతో నేషనల్ క్రష్‌గా మారిన త్రుప్తి డిమ్రితో ఐటెం సాంగ్ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఆఫర్‌ని త్రుప్తి డిమ్రి రిజెక్ట్ చేసింది..

Image

ఆ తర్వాత ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా మారిన శ్రద్ధా కపూర్‌తో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే 4 నిమిషాల ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేసేందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో వద్దనుకున్నారట. బాలీవుడ్ భామలు సైడైపోవడంతో టాలీవుడ్ భామ శ్రీలీలతో చేయించాలని డిసైడ్ అయ్యారట. శ్రీలీల, అర్జున్ కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు ఊగిపోవాల్సిందే అంటున్నారు నెటిజెన్స్.

Also Read :