Asaduddin owaisi: నేను నోరు విప్పితే బీఆర్ఎస్​మటాష్​

బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని, తాను నోరు విప్పితే ఆపార్టీ లీడర్లు ఇబ్బంది పడతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin owaisi) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా? అవి వద్దని నేను చెప్పలేదా? అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? వారి జాతకాలు చెబితే ఎవరూ తట్టుకోలేరు. గులాబీ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇండ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తం. బీఆర్ఎస్​ విధానాలు స్థిరంగా ఉండాలి.

ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు మా చలవే.24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేది. అప్పట్లో ఆ పార్టీ నేతలకు అహంకారం ఉండేది. మేం కాంగ్రెస్ తో జత కట్టామని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ గతంలో మా మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు కదా? జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభం?’ అని అసదుద్దీన్‌ ప్రశ్నించారు(Asaduddin owaisi).

Also Read :