ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడిచిన ట్విట్టర్ వార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Sanjay kumar) స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కు కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. ట్విట్టర్ పోస్ట్ లో.. ‘ప్రియమైన శ్రీ రేవంత్ రెడ్డి గారూ, తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావు. మీ గ్యారంటీలు పేరుకే ఉన్నాయి కానీ అవి అమలుకు నోచుకోవని ప్రజలకు అర్థం అయింది. ఇచ్చిన పథకాల్లో కూడా షరతులు వర్తిస్తాయని తెలంగాణ అమాయక ప్రజలకు తెలియక మోసపోయారు. 6 హామీలకు 100 రోజులు అన్నావు..కానీ పది వేల రోజులు అయిన కూడా సరిపోవు.

మీ అవాస్తవ హామీలు రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. మీరు ఇచ్చిన గ్యారెంటీ ప్రకారం ప్రతి కుటుంబం 2.5 లక్షల ప్రయోజనం పొందాలి..కానీ అది జరగలేదు. కేసీఆర్ కొత్తగా పుట్టిన బిడ్డపై 1లక్ష అప్పుల భారం వేసినట్లే మీరు ప్రతి తెలంగాణ వ్యక్తిపై 2.5 లక్షల అప్పుల భారం వేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని చెబుతున్న కాంగ్రెస్ చాలా మంది రైతులకు చేయలేదు. రైతు భరోసా ఈ సీజన్‌లో ఆగిపోయింది. వరికి 500 బోనస్ అనేది బోగస్ అని ప్రతి చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభం కాలేదు. రూ. 500కు గ్యాస్ సిలిండర్లు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లో, చాలా మంది అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు బూటకం అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మూసీ ప్రాజెక్ట్ కోసం మీ వద్ద 1.5 లక్షల కోట్లు ఉన్నాయి కానీ 6 గ్యారంటీలను అమలు చేయడానికి డబ్బు లేదు. కాళేశ్వరం తరహాలో మరో ఏటీఎంగా మూసీ రూపుదిద్దుకోనుంది. ప్రధాని మోడీ నాయకత్వాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్రం ఇళ్లు నిర్మిస్తోంది. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది పేదల ఇళ్లను కూల్చివేయడం మాత్రమే. తెలంగాణ అసెంబ్లీలో విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ ను కూడా అమలు చేయడం లేదు. రాష్ట్ర పౌరులను రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని బట్ట బయలు అవుతుంది. పట్టపగలే మహిళలపై అత్యాచారాలు .. హత్యలు జరుగుతున్నాయి. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ యొక్క బూటకపు వాగ్దానాల ఎప్పటికీ అమలు కాదు … ఈ జీవితకాలంలో నెరవేరవు. తెలంగాణ పునర్నిర్మాణానికి బదులు మునుపెన్నడూ లేని విధంగా విధ్వంసం చేసి అంధకారంలోకి నెట్టివేస్తున్నారు(Sanjay kumar). మీరు ఇచ్చిన 6 హామీలను అమలు చేసి మీరు పాదయాత్ర చేయాలి. ప్రజల దగ్గరికి వెళ్లి నిజానిజాలు తెలుసుకోండి’ అని అన్నారు.
Also Read :
- Seethakka: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మహిళాశక్తి వారోత్సవాలు
- Asaduddin owaisi: నేను నోరు విప్పితే బీఆర్ఎస్మటాష్

