Sanjay kumar: చంపినోడే సంతాపసభ పెట్టినట్టుంది

Sanjay kumar

మాజీ సర్పంచుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన చేయడం చంపినోడే సంతాప సభ పెట్టినట్టుందని కేంద్ర మంత్రి (Sanjay kumar) బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేంద్ర మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించామని మహారాష్ట్ర ప్రకటనలు ఇస్తోందని (Sanjay kumar) అన్నారు. ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవ పథకాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. 15 వేల కోట్ల ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. శంషాబాద్ లో ఆంజనేయ స్వామి ఆలయంపై దాడి అమానుషమని, హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా ఏకమై రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.

Image

మాజీ సర్పంచుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళన చేయడం చంపినోడే సంతాప సభ పెట్టినట్టుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేంద్ర మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించామని మహారాష్ట్ర ప్రకటనలు ఇస్తోందని అన్నారు. ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవ పథకాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. 15 వేల కోట్ల ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. శంషాబాద్ లో ఆంజనేయ స్వామి ఆలయంపై దాడి అమానుషమని, హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా ఏకమై రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.

Also read: